Nirmala Sitharaman : నేడు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న నిర్మల
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 12 వరకు ఇవి కొనసాగుతాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సభామోదం కోసం ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, రైలు ప్రమాదాలు, కన్వర్ యాత్ర ఘటన వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది.
నేడు ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. FY24 (2023-24)లో భారత్ ఆర్థిక స్థితి, సాధించిన వృద్ధి మొదలైన అంశాలపై ఈ సర్వే అవగాహన కల్పిస్తుంది. బడ్జెట్‌ను అంచనా వేయడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.