Bihar: బీహార్‌లో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం.. మళ్లీ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..
Bihar: ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు నితీష్ కుమార్.;
Bihar: బీహార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీశ్.. ఆర్జేడీ లెఫ్ట్ కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్‌బందన్‌తో జట్టుకట్టారు. ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు నితీష్ కుమార్. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని ఆర్జేడీ సారథ్యంలోని ఏడు పార్టీలతో కూడిన మహాఘట్‌బందన్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు నితీష్‌కుమార్.
ఇందులో భాగంగా మంగళవారం ఒక్కరోజే.. వరుసగా రెండు సార్లు గవర్నర్ ఫాగు చౌహాన్‌తో సమావేశమయ్యారు. తొలిసారి భేటీలో.. బీజేపీతో తెగతెంపులు చేసకున్న విషయాన్ని గవర్నర్‌కు చెప్పి రాజీనామా లేఖను అందజేశారు. రెండోసారి భేటీలో.. ఆర్డీజే సారథ్యంలోని మహాఘట్‌బందన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు మొత్తం 164 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు తెలిపారు నితీష్‌కుమార్. వీరంతా తమకు మద్దతుగా లేఖపై సంతాలు చేశారన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు నితీష్ కుమార్.
బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీలను నాశనం చేస్తుందన్నారు ఆర్డేజీ నేత తేజస్వీ యాధవ్. పంజాబ్, మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందన్నరాయన. భాగస్వామ్య పార్టీలను చీల్చి బీజేపీ అధికారాన్ని చేపట్టాలనుకుంటోందన్నారు. బీహార్‌లోనూ జేడీయూని చీల్చి బీజేపీ సొంతంగా పాలించాలని ప్లాన్ చేసిందన్నారు. అయితే నితీష్ త్వరగా మేల్కొని బీజేపీ కూటమి నుంచి బయటికి వచ్చారన్నారు. ఎన్డీయే కూటమి నుంచి నితీష్ కుమార్ వెళ్లిపోవడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. నితీష్ బీజేపీని, బీహార్ ప్రజల్ని మోసం చేశారంటూ మండిపడ్డారు.
తమకు సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నా.. నితీషన్‌నే సీఎంగా చేశామన్నారు. ప్రజా తీర్పుతో నితీష్ ఆటలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న వేళ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది బీజేపీ . నితీశ్‌కుమార్ ఆర్జేడీతో చేతులు కలపడాన్ని నిరసిస్తూ... మూడ్రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి నిరసన ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. పాట్నాలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ప్రదర్శనలు ప్రారంభిస్తారు