మహా కుంభమేళాను పొడిగించబోమని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కుంభమేళాను పొడిగిస్తారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఒట్టి పుకార్లని, వాటిని నమ్మకూడదని తెలిపింది. మేళాను పొడిగిస్తామని యోగి సర్కారు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదంటోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే దాకా మేళాను పొడిగించేది లేదని ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా.. ఈనెల 26న కుంభమేళా ముగియనున్నది.
మహా కుంభమేళాను రోజులు పొడిగించాలని యోగి ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. భక్తులు ఊహించని రీతిలో హాజరవుతున్నారని అన్నారు. గతంలో ఇలాంటి కుంభమేళాలను 75 రోజుల పాటు నిర్వహించారని, ఈసారి రోజులను తగ్గించారని పేర్కొన్నారు. ‘‘ఇంకా చాలా మంది భక్తులు మేళాలో పాల్గొనాలని అనుకుంటున్నరు. ఈ నేపథ్యంలో కుంభమేళా రోజులను పొడిగిస్తే బాగుంటుంది” అని అఖిలేశ్ తెలిపారు. ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటల నాటికి 1.23 కోట్ల మంది భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేశారు.