Noida Twin Towers: నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత.. నేలమట్టం అయిన భవనాలు..

Noida Twin Towers: కేవలం 9 సెకన్ల వ్యవధిలో ఈ ట్విన్ టవర్స్ మొత్తం నేలమట్టం అయ్యాయి.

Update: 2022-08-28 09:15 GMT

Noida Twin Towers: యూపీలోని నోయిడా ట్విన్ టవర్స్ ను కూల్చివేసారు. మొత్తం 40 అంతస్తులతో కూడిన రెండు భారీ భవన సముదాయాలను..3,700 కేజీల పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. ఈ ట్విన్ టవర్స్ లో ఒకదాని పేరు 'సియాన్'. ఇందులో 29 అంతస్తులు ఉన్నాయి. మరో టవర్ పేరు 'అపెక్స్'. అందులో 32 అంతస్తులు ఉన్నాయి. కేవలం 9 సెకన్ల వ్యవధిలో ఈ ట్విన్ టవర్స్ మొత్తం నేలమట్టం అయ్యాయి. ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత కాంట్రాక్టును ఎడిఫైస్ ఇంజినీరింగ్ అనే కంపెనీకి అప్పగించారు.

బ్లాస్టర్లు, ట్రెయిన్డ్ వర్కర్లు మొత్తం 40 మంది కలిసి నోయిడా ట్విన్ టవర్స్ లో పేలుడు పదార్థాలను అమర్చే ప్రక్రియను ఆగస్టు 13నే ప్రారంభించారు. డిమాలిషంగ్‌ పనులు మొత్తం పూర్తయ్యాయి అన్ని అంతస్తుల్లోనూ దాదాపు 20వేల పేలుడు పదార్థాలను అమర్చారు. ఆగస్టు 26లోగా వాటన్నింటిని కనెక్ట్ చేసి సిద్ధంగా ఉంచుతారు. పేలుడు పదార్థాల కనెక్షన్లను రీ చెక్ చేశారు. 2.30 గంటలకు.. 20వేల పేలుడు పదార్థాల మెయిన్ కనెక్షన్ ను ఒక డిటోనేటర్ కు అనుసంధానించి రిమోట్ ద్వారా పేల్చేశారు. 9 సెకన్ల వ్యవధిలో.. రెప్పపాటు టైంలో ట్విన్ టవర్స్ నేలమట్టం అయింది.

ట్విన్ టవర్స్ కు అత్యంత సమీపంలో ఉన్న రెండు పెద్ద భవన సముదాయాల్లో నివసించే వారిని.. ఆగస్టు 28న ఉదయం 7 నుంచి తాత్కాలికంగా ఖాళీ చేయించనున్నారు. ఎడిఫస్‌ కంపెనీ చెప్పిన తర్వాతే తిరిగి ఇళ్లకు రావాలని సూచించారు అధికారులు. చుట్టుపక్కల సొసైటీలు, పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేస్తున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఫైర్‌ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.దీనిపై వారందరికీ ఇప్పటికే సమాచారాన్ని అందించారు. చుట్టుపక్క భవనాల కోసం ఎడిఫైస్ కంపెనీ ఇప్పటికే వంద కోట్ల రూపాయల ఇన్స్యూరెన్స్‌ కవరేజీని కూడా తీసుకుంది.

కాగా, ఈ ట్విన్ టవర్స్ ను నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్మించింది. ఈ భవన సముదాయాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ పలువురు స్థానికులు 2009 సంవత్సరంలో కోర్టును ఆశ్రయంచారు. ఎన్నో ఏళ్లపాటు ఈ విచారణ కొనసాగగా.. స్థానికుల ఆరోపణలు నిజమేనని కోర్టు నిర్ధారించింది. ఆ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని ఆదేశించింది. ఈ కూల్చివేతతో 25వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయి. వాటిని తొలగించేందుకే మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు.


Tags:    

Similar News