Delhi : వణుకుతున్న ఉత్తర భారతావణి.. ఢిల్లీలో సింగిల్ డిజిట్ టెంపరేచర్

Update: 2025-01-03 10:15 GMT

ఉత్తర భారతం వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరభారతంలో వీస్తున్న చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ పది డిగ్రీలలోపే రికార్డు అవుతోంది. రెడ్ పోర్ట్, ఢిల్లీగేట్, అక్షర్ ధామ్, కరోల్ బాగ్ సహా పలుచోట్ల చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉపశమనం కోసం పలుచోట్ల చలిమంటలు కాచుకుంటున్నారు. ఉదయం పూట ఇళ్లనుంచి బయటకురావాలంటే జనం జంకుతున్నారు. అటు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ తో రాజధాని వాసులు అవస్థలు పడుతున్నారు. సరైన వెలుతురులేకపోవటంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప వాహనదారులు బయటకు రావటం లేదు. దట్టమైన పొగమంచుతో న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సరైన వెలుతురులేకపోవటం వల్లే ట్రైన్ ల షెడ్యూల్ మార్చినట్లు సిబ్బంది చెప్పారు. 

Tags:    

Similar News