Haryana: అందరినీ రక్షించలేం.. భద్రతకు హామీ ఇవ్వలేం

హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు... ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపు;

Update: 2023-08-03 04:00 GMT

హరియాణ సీఎం( Haryana Chief Minister) మనోహర్‌లార్‌ ఖట్టర్(Manohar Lal Khattar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అందరినీ తాము రక్షించలేమంటూ( protect every person) వ్యాఖ్యానించారు. హరియాణలో శాంతిభద్రతలపై పోలీసులు, ఆర్మీ హామీ ఇవ్వలేరని‍ (Not Possible For Police To Protect Everyone‌) అన్నారు. ఆస్తులు నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని అల్లర్లకు పాల్పడినవారే చెల్లిస్తారని ఖట్టర్‌ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని(maintain peace and harmony), పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

హరియాణలోని ప్రతి వ్యక్తికి రక్షణ కల్పించడం పోలీసుల వల్ల సాధ్యం కాదని, శాంతి, సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు ఖట్టర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పోలీసులు అందరినీ రక్షించలేరని అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఒక నిర్దిష్ట వాతావరణం అవసరమని, స్నేహం, సత్సంబంధాలు ఉండాలని ఖట్టర్‌ అన్నారు. అల్లర్లు చెలరేగడానికి కారణమైన మోను మనేసర్, వీహెచ్‌పీ యాత్రలో పాల్గొన్నాడా లేదా అన్నది సీసీటీవీ ఫుటేజ్‌, కాల్‌ రికార్డ్స్‌ ద్వారా అధికారులు దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. రాజస్థాన్ ప్రభుత్వం మోను మనేసర్‌పై కేసుపెట్టిందని ఖట్టర్‌ తెలిపారు.


ఈ హింసాత్మక ఘటనల్లో జరిగిన ఆస్తి నష్టంపై కూడా ఖట్టర్‌ స్పందించారు. అల్లరి మూకల నుంచే బాధితులు పరిహారం పొందుతారని అన్నారు. తమ ప్రభుత్వం గతంలో ఓ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. దానికింద ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లితేనే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని, ప్రైవేటు ఆస్తుల విషయంలో ఎవరైతే నష్టం కలిగించారో వారి నుంచే పరిహారం అందుతుందని హరియాణ సీఎం స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని బాధ్యుల్ని నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

హరియాణా(Haryana)లోని నూహ్‌ జిల్లాలో సోమవారం రెండు వర్గాల మధ్య హింస( communal clashes) చెలరేగింది. ఆ సమయంలో ఓ వర్గం ప్రజలు మరో వర్గం వారిపై రాళ్లతో దాడి చేశారు. పలు కార్లు, దుకాణాలకు నిప్పుపెట్టారు. ఆ ఘర్షణల ప్రభావం గురుగ్రామ్‌పై కూడా పడింది. ఈ హింసలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(cost six lives). అలాగే పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అనంతరం ఈ ఘర్షణలు గురుగ్రామ్‌కు పాకాయి. గురుగ్రామ్‌ సెక్టార్ 57లో ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారుల్లో.. కొందరు ఓ ప్రార్థనా మందిరంపై కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం ఆ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిలో మతపెద్ద ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేంద్ర బలగాలు జిల్లాలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. 

Tags:    

Similar News