Odisha: ఒడిశాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. వారందరికీ చోటు..!
Odisha: ఒడిశాలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా చేశారు.;
Odisha: ఒడిశాలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా చేశారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు సీఎం నవీన్ పట్నాయక్.
అందుకే.. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. దాంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో ఉన్న మొత్తం 20 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11.45 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణా స్వీకారం జరిగింది. ఇందులో రాజీనామా చేసిన కొందరిని మళ్లీ మంత్రి వర్గంలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కొత్తవారికి, యువతకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో నుంచి తప్పించిన వారిని పార్టీలో కీలక పదవులు కట్టబెట్టనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదో సారి అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేకతను దాటుకుని మరోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే కొందరు మంత్రులు కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో.. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు పూనున్నట్లు తెలుస్తోంది.
పార్టీకి చేటు చేస్తున్న వ్యక్తుల్ని పక్కన బెట్టి 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సన్నద్దనం చేయాలన్న ఆలోచనతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. శుక్రవారం బ్రజరాజ్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో.. BJD భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే.. కొత్త మంత్రివర్గానికి రెడీ అవుతున్నారు బీజేడీ నాయకులు.