Jharkhand: జార్ఖండ్ రోప్‌వే ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు..
Jharkhand: జార్ఖండ్‌లోని రోప్‌వే ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.;
Jharkhand: జార్ఖండ్‌లోని రోప్‌వే ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోప్‌వే కేబుల్ కార్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. రెండు Mi-17 హెలికాఫ్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయని వైమానిక దళం తెలిపింది. దేవ్‌ధర్ జిల్లా త్రికూట్ హిల్‌వేలోని రోప్‌వేలో రెండు కేబుల్ కార్‌లు ఢీకొట్టుకున్నాయి. దీంతో మిగిలిన కేబుల్ కార్లన్నీ ఎక్కడివక్కడే గాల్లోనే నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం నాలుగున్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కేబుల్ కార్లు ఢీకొనండతో కార్లన్నీ గాల్లోనే నిలిచిపోయాయి.
పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు NDRF బృందాలు రంగంలోకి దిగాయి. అందులో చిక్కుకుపోయిన కొంత మంది టూరిస్టులను బయటకు తీయగలిగినప్పటికీ.. ఇంకా సుమారు 50 మంది వరకు అందులోనే ఉండిపోయారు. దీంతో నిన్న ఉదయం 10 గంటలకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను రంగంలోకి దిగాయి. నిన్న సాయంత్రం వరకు 30 మందిని మాత్రమే రక్షించగలిగారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాఫ్టర్ ఎక్కుతూ పట్టుసడలడంతో ఓ వ్యక్తి కేబుల్ కార్ నుంచి లోయలోకి పడిపోయాడు. ఈ వీడియో చూస్తున్న వారికి కూడా గుండెలదిరిపోయాయి.
త్రికూట్ రోప్‌వేకు భారత్‌లోనే ఎత్తైన వర్టికల్ రోప్ వేగా పేరుంది. దేవ్‌ధర్ జిల్లాలోని బైద్యనాథ్ ఆలయానికి వచ్చే పర్యాటకులు త్రికూట పర్వతాల్లోని రోప్ వేనూ సందర్శిస్తుంటారు. శ్రీరామ నవమి సందర్భంగా త్రికూట పర్వతాల్లో సరదాగా గడుపుదామని పర్యాటకులు వచ్చారు. అనుకోకుండా ప్రమాదం జరగడంతో రోప్‌వే పైనే చిక్కుకుపోయారు. రోప్‌వే కేబుల్ కార్లలో ఇంకా 20 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. రోప్‌వే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు.