Ola Electric Laysoff : ఓలా ఎలక్ట్రిక్ లో వెయ్యి మంది ఉద్యోగాలు ఊస్ట్

Update: 2025-03-04 10:15 GMT

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా 1000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. నష్టాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించినట్లు సంస్థకు సంబంధించి వర్గాలు తెలిపాయి. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ తో పాటు పలు విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించిన వారిలో ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలోనే ఓలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. గత సంవత్సరం నవంబర్ నెలలో ఓలా 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 మార్చి నాటికి కంపెనీలో 4,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్ట్ విధానంలో పని చేసే ఉద్యోగులు లేరు. వీరిని అధికారికంగా కంపెనీ తన రికార్డు లో చూపించడంలేదు. పనితీరును మెరుగుపర్చుకో వడం తో పాటు, భారీగా పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు వీలుగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2024 డిసెంబర్ నాటికి కంపెనీ నష్టాలు 376 కోట్ల నుంచి 564 కోట్లకు పెరిగాయి. 2024 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 60 శాతానికి పైగా పతనమయ్యాయి.

Tags:    

Similar News