Omicron Variant: ఐసోలేషన్ నుండి తప్పించుకున్న ఒమిక్రాన్ పేషెంట్.. బెంగుళూరులో మరో 10 మంది..
Omicron Variant: ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగుల్లో ఒకరు సినీ ఫక్కీలో దేశం నుంచి పరారయ్యారు.;
Omicron Variant: ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగుల్లో ఒకరు సినీ ఫక్కీలో దేశం నుంచి పరారయ్యారు. ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించగా.. బెంగళూర్‌లోని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. ఇంతలోనే ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ పొందిన అతను.. దుబాయ్‌కి పరారయ్యాడు.
మరో 10మంది ప్రయాణికులు కూడా ఎయిర్‌పోర్ట్ నుంచి తప్పించుకున్నారు. రంగంలోకి దిగిన కర్నాటక పోలీసులు.. తప్పించుకున్న ప్రయాణికులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారిని పట్టుకున్న తర్వాత పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్ట్‌లు వస్తేనే విడిచిపెడతామని అధికారులు చెబుతున్నారు.