Monkeypox In India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. ఢిల్లీలో 5కు చేరిన సంఖ్య..

Monkeypox In India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది.

Update: 2022-08-14 09:45 GMT

Monkeypox In India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు వైద్యులు చెప్పారు. బాధిత యువతికి ఎలాంటి రీసెంట్ ట్రావెల్ హిస్టరీ లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఐతే వీరిలో నలుగురు ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు జులై 14న కేరళలోని కొల్లాం జిల్లాలో నమోదైంది. ఢిల్లీలో జులై 24న ఫస్ట్ కేసు నమోదైంది. మంకీపాక్స్‌పై కేంద్రం ఇప్పటికే అలర్ట్ అయింది. మంకీపాక్స్‌ను కట్టడి చేసేందుకు నియమ నిబంధనలు రూపొందించింది. ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. మంకీపాక్స్ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ తెలిపింది.

Tags:    

Similar News