ChatGPT Go: చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త..
భారతీయుల కోసం ఓపెన్‌ఏఐ చౌకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. రూ. 399కే ‘చాట్‌జీపీటీ గో’;
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAI భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రకటించింది. ఇది ప్రస్తుతం ఉన్న ChatGPT Plusకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చింది. దీని మొదటగా భారత మార్కెట్‌లో లాంచ్ చేయగా.. అతి త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది. OpenAI ప్రకారం.. ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, పెద్ద ఫైల్ అప్‌లోడ్స్, విస్తృతమైన ఇమేజ్ జనరేషన్, అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్, ఇంకా ఎక్కువ మెమరీ ఫీచర్లను పొందవచ్చు. దీని వల్ల వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి.
ChatGPT Go భారతదేశంలో నెలకు కేవలం రూ.399 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది ChatGPT Plus నెలకు రూ. 1,999తో పోలిస్తే చాలా తక్కువ ధర ఉంది. ఈ ప్లాన్ వెబ్, iOS, ఆండ్రాయిడ్, అలాగే డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లపై లభిస్తుంది. ప్రస్తుతం ఇది భారత మార్కెట్‌కే పరిమితం చేయబడింది. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ధరలను నేరుగా భారత కరెన్సీ లోనే చెల్లింపులు, క్రెడిట్ కార్డు లేదా UPI ద్వారా చేయవచ్చు. అయితే API వినియోగం ఈ ప్లాన్‌లో ఉండదు.. అది వేరుగా బిల్లింగ్ అవుతుంది.
ChatGPT Go సబ్‌స్క్రిప్షన్ పొందడం చాలా సులభం. ముందుగా వినియోగదారులు ChatGPT వెబ్ లేదా మొబైల్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత స్క్రీన్ కుడి కింద మూలలో ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి Upgrade Plan ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ Try Go ఎంపిక చేసి.. చెల్లింపు పూర్తి చేస్తే సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్ అవుతుంది.
ఈ ప్లాన్ ద్వారా ఉచిత ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు మరిన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా 10 రెట్లు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, ఇమేజ్ జనరేషన్స్, ఫైల్ అప్‌లోడ్స్ సౌకర్యం ఉంటుంది. వినియోగదారులు GPT-5 మోడల్‌తో విస్తృతమైన యాక్సెస్ పొందగలరు. అలాగే పెద్ద డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు విశ్లేషించడానికి ఇది సపోర్ట్ చేస్తుంది.
ఇకపైథాన్ వంటి డేటా అనలిసిస్ టూల్స్‌కు కూడా అధిక లిమిట్స్ లభిస్తాయి. ఎక్కువ కాన్టెక్స్ట్ విండో కారణంగా సుదీర్ఘ సంభాషణలను గుర్తుంచుకోవడం సులభమవుతుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్స్, టాస్క్స్, కస్టమ్ GPTs యాక్సెస్ ద్వారా వినియోగదారులు తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.
ChatGPT Go ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో Sora వీడియో-జనరేషన్ మోడల్ అందుబాటులో ఉండదు. అలాగే Codex Agent కూడా ఇందులో భాగం కాదు. అంటే కోడ్‌బేస్‌పై ప్రశ్నలు అడగడం, కోడ్‌ను నేరుగా ఎగ్జిక్యూట్ చేయడం, పుల్ రిక్వెస్ట్‌లను ఆటోమేటిక్‌గా డ్రాఫ్ట్ చేయడం వంటి అవకాశాలు లభించవు.
ఈ సందర్భంగా OpenAI ChatGPT హెడ్ నిక్ టర్లే మాట్లాడుతూ.. ChatGPTని మరింత చౌకగా అందుబాటులోకి తేవాలని వినియోగదారులు కోరారు. అందుకే భారత్‌లో మొదటగా Go ప్లాన్ ప్రారంభించాం. ఇక్కడి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా త్వరలో ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తాం అని తెలిపారు.