‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆపరేషన్ ముగిసేంత వరకూ వార్ రూంలోనే ఉన్నారు ప్రధాని మోదీ. అలా త్రివిధ దళాలకు బాసటగా వున్నారు. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా భారత బలగాలు ధ్వంసం చేశాయి. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగంది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది.
ఆపరేషన్ సింధూర్ ను అత్యంత పకడ్బంధీగా భారత్ అమలుచేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలుచేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్ షాక్‌కు గురికాక తప్పలేదు.