ఆపరేషన్ సిందూర్.. ఐదుగురు అగ్ర జైష్-ఎ-మహ్మద్ లష్కరే-తోయిబా ఉగ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్ ఆధ్వర్యంలో పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో ఐదుగురు అగ్ర జైష్-ఎ-మొహమ్మద్ & లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.;
ఆపరేషన్ సిందూర్ ఆధ్వర్యంలో పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో ఐదుగురు అగ్ర జైష్-ఎ-మొహమ్మద్ & లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులు ముదస్సర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్, మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఖలీద్ అలియాస్ అబు ఆకాషా మరియు మొహమ్మద్ హసన్ ఖాన్ అని వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదులను ఈ నెల 7వ తేదీన ఆపరేషన్ సమయంలో మట్టుబెట్టారు.