Indian Army: పాక్ రేంజ‌ర్ల కాల్పులు.. భార‌త జ‌వాన్ మృతి

జవాన్ తో పాటు 15 మంది పౌరుల మృతి;

Update: 2025-05-08 02:45 GMT

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడ్డారు. వీరి కుటుంబాలకు కూడా భారత ఆర్మీ మానవీయ సహానుభూతిని ప్రకటించింది.

ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మెరుపుదాడులు చేపట్టింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులు జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్, భారతదేశంపై మరింత దాడులకు పూనుకుంది. పాక్ రేంజర్లు ఫూంచ్, తంగధర్ ప్రాంతాల్లో తీవ్ర కాల్పులకు దిగారు. అయితే ఈ దాడులకు భారత సైన్యం సమర్థంగా ప్రతిఘటించింది.

Tags:    

Similar News