UPA: మోదీపై యుద్ధం... పేరు మార్చుకోనున్న UPA ..!?

Update: 2023-07-17 12:55 GMT

యునైటెడ్‌ ప్రొగెసివ్‌ అలయన్స్‌ ( UPA ) తన పేరు మార్చుకోబోతోంది. బీజేపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యంలో మరో పేరుతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. బెంగళూరు తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌ వేదికగా ఇవాళ, రేపు జరగబోయే విపక్ష భేటీలో ఈ నిర్ణయం ఉండబోతుందనే సంకేతాలు అందుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కూటమికి కొత్త పేరు ఉండాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ సహా టీఎంసీ, ఆమ్ ‌ఆద్మీ పార్టీలు పేరు మార్పుపై ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పేరును రేపు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే కీలక నేతలు బెంగళూరు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఖర్గే ప్రసంగంతో సమావేశం ప్రారంభం కానుంది. 24 పార్టీల నేతలు ఈ రెండ్రోజుల కీలక భేటీకి హాజరు కానున్నారు.


మరోవైపు కూటమికి పేరుపై విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు నెలకొంది. ఇప్పుడే పేరు పెట్టడం తొందరపాటు అని కొన్ని పార్టీలు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కూడా ఆయా రాష్ట్రాల పరిస్థితులు ఆధారంగా జరగాలని మెజారిటీ పార్టీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అలాగే పార్టీల మధ్య మరింత సమన్వయం ఉండాల్సిందన్న భావనలో కూడా పార్టీలు ఉన్నట్లు సమాచారం. అటు విపక్ష కూటమికి కన్వీనర్ లేదా చైర్ పర్సన్ నియామకంపైనా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

ఇక బిహార్‌ సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీ,ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ పార్టీలు బెంగళూరు భేటీకి హాజయ్యే ఛాన్స్‌ ఉంది. మొత్తం 24 విపక్ష పార్టీలకు పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలు ఉన్నారు. విస్తృత చర్చల తర్వాత నేతలంతా ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ భేటీలో తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.

మరోవైపు మొత్తం 24 విపక్ష పార్టీలకు పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు విపక్ష నేతలు కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిర్వహించే విందులో అనధికారిక చర్చలు జరిగే అవకాశం ఉంది.యూపీఏ కూటమి నేతలు విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.మొత్తమ్మీద బెంగళూరు భేటీ తర్వాత విపక్షాల కూటమికి ఓ షేపు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయతావాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తమ కూటమి పేరులో జాతీయ అనే పదం వుండేలా చూసుకుంటున్నాయి బీజేపీయేతర విపక్ష పార్టీలు.

Tags:    

Similar News