Paper Leak: ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్.. ఎక్కడంటే

మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు;

Update: 2025-03-24 01:45 GMT

అస్సాంలో మార్చి 21న జరగాల్సిన హయ్యర్ సెకండరీ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. మూడు ప్రభుత్వ విద్యాసంస్థలు సహా 18 స్కూల్స్‌లో ఉంచిన మ్యాథ్స్‌ పేపర్‌ సీల్‌ తీసి సోషల్‌ మీడియాలో లీక్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అస్సాం హైయర్‌ సెకండరీ బోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది.

కాగా, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్ రద్దును అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ధృవీకరించారు. షెడ్యూల్ పరీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రభుత్వ విద్యాసంస్థలతో సహా 18 స్కూల్స్‌లో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. 10 జిల్లాల్లోని 15 ప్రైవేట్ స్కూల్స్‌ గుర్తింపును బోర్డు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో మూడు స్కూల్స్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 11వ తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను బోర్డు అధికారులు తర్వలో ప్రకటిస్తారని ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరోవైపు గత వారం, అస్సాంలోని బార్‌పేట జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్‌ వార్షిక పరీక్షా పేపర్‌ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. పేపర్‌ లీక్‌పై పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డాయి. విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు రాజీనామా చేయాలని, బోర్డు చీఫ్ ఆర్సీ జైన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.

Tags:    

Similar News