Pahalgam terrorists: పహల్గామ్ ముష్కరులు ఖతం..
జమ్మూ కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్న ముగ్గురు ముష్కరులు..;
జమ్మూ కాశ్మీర్‌లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.
అయితే, ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు పాకిస్తాన్ అనుమానిత ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులు సైన్యం జరుపుతున్న ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. హిర్వాన్ – లిద్వాస్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. గత 2 నెలలుగా ఈ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ‘‘ఆపరేషన్ మహదేవ్’’ పేరుతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టి, ఉగ్రవాదుల్ని హతం చేశారు.
భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. నివేదికల ప్రకారం, ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.