Shivraj Singh Chouhan: అలా చేస్తే పాకిస్థాన్‌ ప్రపంచపటంలో ఉండదు:

కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ హెచ్చరిక;

Update: 2025-05-13 23:39 GMT

దాయాది దేశం పాకిస్థాన్‌ను కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘిస్తే ప్రపంచ పటంలో తన ఉనికిని కోల్పోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వార్నింగ్ ఇచ్చారు.

ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. దాయాది దేశ కుట్రలను భారత సైన్యం సులువుగా తిప్పికొట్టిందని వెల్లడించారు. దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించడంతో ప్రభుత్వాలపై ఖర్చుల భారం పడుతుందన్నారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు మద్దుతు తెలపాలని శివరాజ్‌సింగ్‌ కోరారు.

Tags:    

Similar News