India-Pakistan War: భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్లు

అడ్డుకున్న భారత రక్షణ వ్యవస్థ.. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్;

Update: 2025-05-13 00:30 GMT

 పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో పాక్ కి చెందిన డ్రోన్లు దూసుకు రావడంతో భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. వరుస ఘటనలతో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. అయితే, కాల్పుల విరమణను ఉల్లంఘించవద్దని పాకిస్తాన్‌కు భారత సైనిక అధికారులు హెచ్చరించారు. ఇకపై ఏవైనా ఉల్లంఘనలు జరిగితే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామని పేర్కొన్నారు.

కాగా, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారులు బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు. మరోవైపు, బడ్మేయర్, జై సల్మేర్, బికనీర్, శ్రీగంగానగర్ లలో పాక్షికంగా బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు. సాంబ సెక్టార్ లో డ్రోన్లు కనిపించడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

ఇండిగో విమాన సేవలు.. ఈ ప్రాంతాలకు రాకపోకలు రద్దు

భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు అనిపించడంతో విమాన సేవలను పునరుద్ధరించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఇండిగో ఎయిర్‌వేస్‌ మాత్రం తమ సేవలను మంగళవారం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండిగో సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ప్రయాణికుల భద్రతే మాకు తొలి ప్రాధాన్యం. జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్‌, లెహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌కు మే 13న (మంగళవారం) రాకపోకలను రద్దు చేస్తున్నాం. ఇప్పటికే ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నవారి ఇబ్బందిని అర్థం చేసుకోగలం. అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. మా బృందాలు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఇస్తాం. మీరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేముందు విమానం స్టేటస్‌ను మా వెబ్‌సైట్‌, యాప్‌లో చెక్‌ చేసుకోగలరు. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కేవలం మెసేజ్ లేదా కాల్‌ దూరంలోనే ఉంటాం. సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం’ అని పోస్టు చేసింది. 

Tags:    

Similar News