Panneerselvam: పన్నీర్ సెల్వానికి మరో బిగ్ షాక్.. చేజారిన అన్ని పదవులు..
Panneerselvam: అన్నాడీఎంకేలో పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయిన మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మరో ఎదురుదెబ్బ తగిలింది.;
Panneerselvam: అన్నాడీఎంకేలో పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయిన మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పన్నీర్‌సెల్వం రాజకీయ జీవితంలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనేత పదవి నుంచి ఆయనను తప్పించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్‌కుమార్‌ను నియమించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని స్పీకర్‌కు ఎస్పీ వేలుమణి అందజేశారు. దీంతో పన్నీర్ చేతి నుంచి అన్ని పదవులు చేజారిపోయినట్లు అయ్యింది.
ఓపీఎస్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సర్వసభ్య మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఖాళీ అయిన ఆ పదవిని ఉదయకుమార్‌కు అప్పగించినట్లు ఈపీఎస్ తెలిపారు. పార్టీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పళనిస్వామి తెలిపారు.అలాగే అన్నాడీఎంకే సభాపక్షం డిప్యూటీ కార్యదర్శిగా అగ్రి కృష్ణమూర్తిని నియమించామన్నారు.