Greater Noida: నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపేశాడని తెలిపిన కొడుకు..
గ్రేటర్ నోయిడాలో మరో దారుణం..;
గ్రేటర్ నోయిడాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిర్సా గ్రామంలో భార్యపై అత్తింటివారు సజీవదహనం చేశారు. దారుణాన్ని బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తెలిపాడు. తన తండ్రే తల్లిని చంపేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. బాలుడు తన తల్లి పైకి ఏదో ద్రవం పోసి, ఆ తరువాత చెంపపై కొట్టి, చివరికి లైటర్‌తో కాల్చేశాడని తెలిపాడు. ఆ బాలుడి మాటలు: “మేరీ మమ్మీ కే ఉపర్ కుఛ్ దాలా, ఫిర చాంటా మారా ఫిర లైటర్ సే ఆగ్ లగా దీ,” అంటూ అమాయకుడు చెప్పిన మాటలు వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక, మీడియా ప్రతినిధులు “మీ నాన్నే చంపాడా?” అని అడగగా, బాలుడు అవును అని తల ఊపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఓ మహిళపై దాడి చేసి, ఆమెను వెంట్రుకలు పట్టుకొని బయటికి లాగుతున్నారు.. అలాగే, మరో వీడియోలో మంటల్లో చిక్కుకున్న బాధితురాలు మెట్లపై నుంచి అరుస్తున్నా దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అయితే, మృతురాలి అక్క మాట్లాడుతూ.. “నా చెల్లిని రూ.36 లక్షల కట్నం కోసం భర్త, అత్తింటివారు చంపేశారు” అని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా మమ్మల్ని బాగా వేధిస్తున్నారు.. గురువారం రాత్రి మా చెల్లిని క్రూరంగా కొట్టి, చివరికి సజీవదహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నా చెల్లిపై అనేక రకాల దారుణాలకు పాల్పడ్డారు. ఇంత జరుగుతుంటే మా చెల్లి పిల్లలు కూడా అదే ఇల్లు లోపలే ఉన్నారు.. నేను ఏం చేయలేకపోయాను.. నన్ను కూడా చాలా వేధించారంటూకన్నీళ్ల పెట్టుకుంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.