Parliament:పార్లమెంట్‌లో ఆరోగ్య, జాతీయ సెస్ బిల్లు-2025?

రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు యత్నం ## రక్షణ శాఖకు కేంద్రం అధిక ప్రాధాన్యత ## శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో  బిల్లు 

Update: 2025-12-02 08:30 GMT

జా­తీయ భద్రత, ప్ర­జా­రో­గ్య రం­గాల కోసం అద­న­పు ని­ధు­ల­ను సమీ­క­రిం­చే లక్ష్యం­తో కేం­ద్ర ప్ర­భు­త్వం లో­క్‌­స­భ­లో ‘ఆరో­గ్య భద్రత, జా­తీయ భద్ర­తా సెస్ బి­ల్లు-2025’ను ప్ర­వే­శ­పె­ట్ట­నుం­ది. పా­ర్ల­మెం­టు శీ­తా­కాల సమా­వే­శా­ల్లో ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ ఈ కీలక బి­ల్లు­ను సభలో ప్ర­వే­శ­పె­ట్ట­ను­న్న­ట్లు తె­లు­స్తుం­ది. ఈ ప్ర­తి­పా­దిత సెస్ అనే­ది ని­ర్ది­ష్ట వస్తు­వుల ఉత్ప­త్తి, తయా­రీ యం­త్రా­ల­కు వర్తి­స్తుం­ద­ని అధి­కా­రిక వర్గా­లు తె­లి­పా­యి. త్వ­ర­లో ము­గి­య­ను­న్న పొ­గా­కు ఉత్ప­త్తు­ల­పై పరి­హార సె­స్‌­ను ఈ కొ­త్త సెస్ భర్తీ చే­య­నుం­ద­ని మా­ర్కె­ట్‌ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. దీని ద్వా­రా పొ­గా­కు ఉత్ప­త్తు­ల­పై ఉన్నత స్థా­యి జీ­ఎ­స్టీ రే­టు­ను కొ­న­సా­గిం­చేం­దు­కు అవ­కా­శం ఉం­టుం­ద­ని సమా­చా­రం.

ఈ సె­స్‌­ను అమ­ల్లో­కి తీ­సు­కు­వ­చ్చేం­దు­కు జా­తీయ భద్రత, ప్ర­జా­రో­గ్యం అనే రెం­డు ప్ర­ధాన అం­శా­లు కా­ర­ణం­గా ఉన్నా­యి. ఇటీ­వ­లి ‘ఆప­రే­ష­న్ సిం­దూ­ర్’ నే­ప­థ్యం­లో రక్ష­ణ­కు అధిక ప్రా­ధా­న్యత ఇవ్వా­ల్సిన అవ­స­రం ఏర్ప­డిం­ది. ఈ ఏడా­ది ప్రా­రం­భం­లో పా­ర్ల­మెం­ట­రీ స్థా­యి ప్యా­నె­ల్ ‘ఫ్యూ­చ­ర్ వా­ర్‌­ఫే­ర్ ఫండ్’ ఏర్పా­టు చే­యా­ల­ని సి­ఫా­ర­సు చే­సిం­ది. ఈ ని­ధి­ని సా­యుధ దళా­ల్లో భవి­ష్య­త్ యు­ద్ధ సాం­కే­తి­క­తల అధ్య­య­నం కోసం ఉప­యో­గిం­చా­ల­ని సూ­చిం­చిం­ది. 2025-26 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి రక్షణ కే­టా­యిం­పు­లు ఇప్ప­టి­కే రూ.6.18 లక్షల కో­ట్లు దా­టా­యి. ఈ సె­స్‌ అమ­ల్లో­కి వస్తే మరింత ని­ధు­లు చేరే అవ­కా­శం ఉం­టుం­ది. ఆయు­ష్మా­న్ భా­ర­త్ వంటి కీలక ఆరో­గ్య పథ­కాల వి­స్త­ర­ణ­కు అద­న­పు వన­రుల అవ­స­రం ఉంది. ప్ర­స్తు­తం దేశ జనా­భా­లో­ని 40 శాతం ప్ర­జ­ల­కు చెం­దిన సు­మా­రు 55 కో­ట్ల మంది లబ్ధి­దా­రు­ల­కు అంటే దా­దా­పు 12.37 కో­ట్ల కు­టుం­బా­ల­కు ఏటా రూ.5 లక్షల ఆరో­గ్య బీమా లభి­స్తోం­ద­ని ప్ర­భు­త్వ చె­బు­తుం­ది. 2025-26లో ఆరో­గ్య రం­గా­ని­కి సు­మా­రు రూ.1 లక్ష కో­ట్ల వ్య­యం అం­చ­నా వే­య­గా, జా­తీయ ఆరో­గ్య వి­ధా­నం

ఆరో­గ్య వ్య­యా­న్ని జీ­డీ­పీ­లో 2.5 శా­తా­ని­కి పెం­చా­ల­ని సి­ఫా­ర­సు చే­స్తోం­ది. దాం­తో ఈ సె­స్‌ ఎంతో తో­డ్ప­డు­తుం­ద­ని ప్ర­భు­త్వం అం­చ­నా వే­స్తోం­ది. ఈ కొ­త్త సెస్ బి­ల్లు­తో పాటు, 1944కి చెం­దిన వలస పాలన కాలం సెం­ట్ర­ల్ ఎక్సై­జ్ యా­క్ట్‌­ను కూడా ప్ర­భు­త్వం సవ­రిం­చ­నుం­ది. సవరణ అనం­త­రం ఎక్సై­జ్ సుం­కం కే­వ­లం ముడి పె­ట్రో­లి­యం, పె­ట్రో­ల్, డీ­జి­ల్, ఏవి­యే­ష­న్ టర్బై­న్ ఫ్యూ­ల్, సహజ వా­యు­వు, పొ­గా­కు ఉత్ప­త్తు­ల­కు మా­త్ర­మే వర్తి­స్తుం­ద­నే అం­చ­నా­లు­న్నా­యి. దీ­ని­కి సం­బం­ధిం­చి ఇంకా సమ­గ్ర వి­వ­రా­లు తె­లి­యా­ల్సి ఉంది. పన్ను పరి­ధి­ని వి­స్త­రిం­చే ఉద్దే­శం లే­క­పో­యి­నా సమ­కా­లీన ఆర్థిక అవ­స­రా­ల­కు అను­గు­ణం­గా పాత చట్టా­న్ని ఆధు­నీ­క­రిం­చ­డ­మే ఈ సవరణ లక్ష్యం అని ప్ర­భు­త్వం పే­ర్కొం­ది.

 ఇప్పటికే అమలవుతున్న సెస్‌లు

ఆదాయపు పన్నుపై 4% హెల్త్‌, ఎడ్యుకేషన్‌ సెస్.

పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్.

పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్.

ఈ సె­స్‌ల నుంచి వచ్చే ఆదా­యా­న్ని కేం­ద్రం రా­ష్ట్రా­ల­తో పం­చు­కో­దు. కా­బ­ట్టి రా­ష్ట్ర ప్ర­భు­త్వాల నుం­చి తరచూ వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. సరి­హ­ద్దు ఉద్రి­క్త­త­లు, పె­రు­గు­తు­న్న ఆరో­గ్య డి­మాం­డ్ల నే­ప­థ్యం­లో కేం­ద్రం ఈ రెం­డు కీలక రం­గా­ల­ను సమా­నం­గా బలో­పే­తం చే­యా­ల­ని చూ­స్తోం­ది. అయి­తే సె­స్‌­ల­పై అధి­కం­గా ఆధా­ర­ప­డ­టం వల్ల కేం­ద్ర-రా­ష్ట్ర ప్ర­భు­త్వాల ఆర్థిక సం­బం­ధా­లు, వి­ని­యో­గ­దా­రు­ల­పై అద­న­పు భారం వంటి అం­శా­ల­పై మరో­సా­రి చర్చ మొ­ద­ల­య్యే అవ­కా­శం ఉంది. ఈ నే­ప­థ్యం­లో ఈ రెం­డు బి­ల్లు­లు ప్ర­స్తుత శీ­తా­కాల సమా­వే­శా­ల్లో ప్ర­ధాన చర్చాం­శం­గా మా­ర­ను­న్నా­యి.

Tags:    

Similar News