Parliament : ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..టెర్రర్ ఎటాక్ పై చర్చించాలన్న విపక్షాలు

Update: 2025-07-21 12:00 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు పహల్గాం టెర్రర్ అటాక్ , ఆపరేషన్ సింధూర్ పై చర్చించాలని వాయిదా తీర్మానాలు అందజేశాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. టెర్రరిస్టు ఎటాక్ పై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు డిమాండ్ చేశారు. అయితే, ఆ ప్రశ్నలకు ప్రధాని ఎప్పుడో సమాధానం చెప్పారని బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ బదులిచ్చారు. దీంతో చర్చకు పట్టుబడుతూ.. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా కలుగుజేసుకుని ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల తర్వాతే ఎవరైన తనకు వాయిదా తీర్మానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై సావధానంగా చర్చిద్దామని చెప్పినప్పటికీ విపక్షాలు నినాదాలు చేయడంతో సభ ను కాసేపు వాయిదా వేశారు స్పీకర్ ఓమ్ బిర్లా..

Tags:    

Similar News