విమానంలో ప్రయాణిస్తూ ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు
బస్సులో ప్రయాణిస్తున్నా ఆగితేనే డోర్ తెరుస్తారు.. అలాంటిది గాల్లో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు ఓ ప్రయాణికుడు..;
బస్సులో ప్రయాణిస్తున్నా ఆగితేనే డోర్ తెరుస్తారు.. అలాంటిది గాల్లో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు ఓ ప్రయాణికుడు.. ఢిల్లీ నుండి చెన్నై ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఈ ఘనకార్యం చేశాడు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయపడిపోయారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం 6E 6341లో ఈ ఘటన జరిగింది.
మణికందన్‌గా గుర్తించిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. చెన్నై విమానాశ్రయంలో దిగగానే ఎయిర్‌లైన్ అధికారులు సీఐఎస్‌ఎఫ్ అధికారులకు ఘటన గురించి వివరించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒక ప్రయాణీకుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించారని మా సిబ్బంది గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.