Pawan Kalyan: మురుగన్‌ భూమి తమిళనాడుకి, మధుర మీనాక్షి అమ్మవారికి పవన్ కృతజ్ఞతలు

డిప్యూటీ సీఎం పోస్ట్ వైరల్..!;

Update: 2025-06-23 01:00 GMT

ఆదివారం (జూన్ 22)న మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్‌ మానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనకు అక్కడ ఘానా స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఆయన హిందుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, అలాగే తాను ఇంట్లోని విభూతి పెట్టుకొనే బడికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. తాను అన్ని మాతాలను గౌరవిస్తానని, హిందువుగా ఉండడం గర్వంగా ఉందని అన్నారు.

ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. ఇందులో ధుర మీనాక్షి అమ్మవారి పవిత్రమైన భూమి మధురైకి, అలాగే శక్తి స్వరూపుడు మురుగన్‌ నేల తమిళనాడు మట్టికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. మీరు చూపిన ప్రేమ, భక్తి నాకు అపూర్వ అనుభూతిని కలిగించాయని.. ఈ పవిత్ర భూమి, ఇక్కడి ప్రజలు ధార్మిక భారతదేశ జీవరూపమే అంటూ రాసుకొచ్చారు.

అలాగే “మురుగన్‌ భక్తర్గళ్‌ మానాడు” కార్యక్రమానికి అత్యంత భక్తి శ్రద్ధలతో హాజరైన ప్రతి భక్తుడికీ నా కృతజ్ఞతలు. ఈ సమ్మేళనంలో మీ అందరి ఉనికి ఒక దైవానుగ్రహంగా భావించాలి. ఈ భూమి ధర్మ పథాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆదర్శ ప్రదేశంగా నిలిచిందని అన్నారు. ఈ ఘన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తమిళనాడు అధ్యక్షులు తిరు కడేశ్వర సుబ్రహ్మణ్యం అవర్గళ్‌, బీజేపీ తమిళనాడు అధ్యక్షులు తిరు నైనార్ నాగేంద్రన్ అవర్గళ్‌, మాజీ అధ్యక్షుడు తిరు అన్నామలై అవర్గళ్‌, కేంద్ర మంత్రి తిరు ఎల్. మురుగన్ అవర్గళ్‌, మాజీ తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అవర్గళ్‌, సీనియర్ రాజకీయ నాయకుడు తిరు కే.ఎస్. రాధాకృష్ణన్ అవర్గళ్‌, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని మత గురువులు, సన్యాసులు, ఇతర గౌరవనీయ అతిథులు, భక్తులకు నా హృదయపూర్వక నమస్సులంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News