Petrol And Diesel Price: దేశంలో భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు.. 8 రోజుల్లో 7 సార్లు..

Petrol And Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. గ‌డిచిన 8 రోజుల్లో ఏడు సార్లు ధ‌ర‌లు పెరిగాయి.

Update: 2022-03-29 04:37 GMT

Petrol And Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. గ‌డిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. ఆయిల్ కంపెనీలు మ‌రోసారి వాహ‌న‌దారుల‌కు షాకిచ్చాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు చొప్పున పెంచారు. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ 113 రూపాయల 61 పైసలుగా ఉంది. డీజిల్ 99 రూపాయల 84 పైసలుగా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ 115 రూపాయల 52 పైసలు, డీజిల్‌ 101.36కి చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ వంద రూపాయలు దాటింది. డీజిల్‌ 91 రూపాయల 47 పైసలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర 115 రూపాయలుగా ఉంది. డీజిల్‌ 99.25కు చేరింది. ఇక ఇప్పటివ‌ర‌కు పెట్రోల్‌, డీజిల్‌పై 4 రూపాయల 80 పైసలు చొప్పున పెరిగాయి. 

Tags:    

Similar News