PM Fasal Bima : నేడు PM ఫసల్ బీమా నిధులు జమ

Update: 2025-08-11 05:30 GMT

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. నేడు (ఆగస్టు 11, 2025) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద 30 లక్షల మంది రైతులకు రూ. 3,200 కోట్లు జమ చేయనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజస్థాన్‌లోని జుంజునులో జరిగే ఒక కార్యక్రమంలో ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నిధులలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రైతులకు రూ.1,156 కోట్లు, రాజస్థాన్ రైతులకు రూ.1,121 కోట్లు, ఛత్తీస్గఢ్కు రూ.150 కోట్లు కేటాయించారు. మిగతా రాష్ట్రాల రైతులకు రూ.773 కోట్లు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించడం. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను ప్రభుత్వం భరిస్తుంది. క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసి, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కోసం వేచి చూడకుండా కేంద్ర ప్రభుత్వం తన వాటాను నేరుగా జమ చేస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం లేదా బీమా కంపెనీలు చెల్లింపులో ఆలస్యం చేస్తే, వారికి 12% జరిమానా విధించడం జరుగుతుంది.

Tags:    

Similar News