PM Kisan Samman Nidhi Yojana: రైతులకు రూ.20,946 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ..
PM Kisan Samman Nidhi Yojana: వ్యవసాయ ఉత్పత్తుల ఎగమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని ప్రధాని మోదీ అన్నారు.;
PM Kisan Samman Nidhi Yojana: వ్యవసాయ ఉత్పత్తుల ఎగమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదో విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. వర్చ్యువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్దిదారులతో మోదీ మాట్లాడారు.
పీఎమ్ కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల 946 కోట్లు జమయ్యాయి. ఏడాదికి 6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది. మూడు విడతల్లో అర్హులైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు 2 వేల రూపాయల చొప్పున నేరుగా జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఒక కోటి 6 లక్షల కోట్లు అందజేసినట్లు కేంద్రం తెలిపింది.