ప్రతినెలా చివరి ఆదివారం ఉదయం 11కి గుర్తుకొచ్చే రేడియో కార్యక్రమం ప్రధాన మంత్రి మన్‌కీ బాత్. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తన మన సులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో పలుమార్లు తెలుగు రాష్ట్రాల అంశాలను కూడా ప్రస్తావించారు. రేపు 100వ భాగం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఆ కార్యక్రమాన్ని ప్రజలు వినేందుకు వీలుగా బీజేపీ నాలుగు లక్షల వేదికలను ఏర్పాటు చేస్తోంది.
2015 జూన్ 28న... కర్నూలు జిల్లాలోని బెలుం గుహల అందాలను మోదీ ప్రస్తావిం చారు. 2015 అక్టోబరు 25న.. విజయనగరం జిల్లా ద్వారపూడి పంచాయతీలో పిల్లలే ఉపాధ్యాయులుగా మారి వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పడాన్ని ప్రజలకు తెలియ జేశారు. ఇందులో అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు భాగస్వాములైనట్లు ప్ర స్తావించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని రామోజీరావు వ్యక్తిగత కార్యక్రమంగా తీసు కున్నట్లు చెప్పారు. స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభమైన నాటి నుంచి తెలుగు రాష్ట్ర ల్లో ప్రజాచైతన్యం తీసుకొస్తున్నట్లు చెప్పారు.
2016 మే 22న.. రైతు సోదరులు మిషన్ భగీరథ ద్వారా కృష్ణా, గోదావరి నీటిని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకొనే ప్రయత్నం చేసినట్లు మోదీ తెలియజేశారు. ఏపీలో నీ రు ప్రగతి మిషన్ కార్యక్రమం ద్వారా భూగర్భజలాల రీఛార్జ్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 2016 డిసెంబరు 25న.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్స హించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను అభినం దించారు. ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపుల విస్తృతి కోసం ఏర్పాటైన అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ ఈ పథకం కింద విభిన్న కొత్త పథకా లను పరిగణిస్తున్నట్లు చెప్పారు.
2018 మే 27న.. గ్రామీణ క్రీడల గురించి చెబుతూ ఏపీలోని గోటిబిల్ల, కర్రబిల్ల గురిం చి మోదీ ప్రస్తావించారు. 2019 జూన్ 30న.. తెలంగాణలోని తిమ్మాయిపల్లిలో నిర్మిం చిన వాటర్ ట్యాంక్ అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2020 ఆగస్టు8న.. కృష్ణా జిల్లాలోని కొండపల్లి బొమ్మల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా విశాఖకి చెందిన సీవీరాజు ఏటికొప్పాక బొమ్మలను రక్షిస్తున్న తీరును వివరించారు. 2021 జనవరి 31న.. కూరగాయల వ్యర్థాల ద్వారా విద్యుత్తు తయారు చేస్తున్న హైద రాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయాల మండీ గురించి ప్రత్యేకంగా చెప్పారు.
2021 మార్చి 28న విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస పదకండ్లజీ ఆటోమొ బైల్ వ్యర్థాలతో కళాఖండాలను సృష్టిస్తున్న తీరు గురించి ప్రస్తావించారు. ఆయన చేసిన భారీ కళాకృతులు పార్కుల్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు కూడా ఆసక్తితో తిలకిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 అక్టోబరు 24న.. తెలంగాణలో వ్యాక్సిన్లను డ్రోన్లతో తరలించిన విషయం ప్రస్తావించారు. 2022 మార్చి 27న కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పం డే బంగినపల్లి, సువర్ణరేఖ రకం మామిడిపండ్ల గురించి ప్రస్తావించారు. దక్షిణ కొరి యాకు ఎగుమతి అవుతున్నట్లు తెలియజేశారు. సికింద్రాబాద్ బన్సిలాల్‌పేటలోని మెట్ల బావిని ప్రజాభాగస్వామ్యంతో పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావించారు.
2022 జూన్ 26న తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణా మలావత్ గొప్ప తనం గురించి చెప్పారు. 13 ఏళ్ల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఘనత ఈ భరతమాత ముద్దుబిడ్డకు దక్కు తుందని కీర్తించారు. 2022 జులై 31న మేడారంలో జరుపుకొనే సమక్క, సారలమ్మ జాతర గురించి ప్రస్తావించారు. ఇది తెలంగాణ కుం భమేళాగా ప్రసిద్ధిపొందిందన్నారు. 2022 నవంబరు 27న.. సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత సోదరుడు యెల్దిహరిప్రసాద్ తనకు చేత్తోనేసిన జీ-20 లోగోను పంపిన విష యాన్ని వెల్లడించారు. ఆ అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు.
2023 ఫిబ్రవరి 26న ఆజాదీకా అమృత్‌మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పో టీలో కర్నూలు జిల్లాకు చెందిన విజయదుర్గ అనే మహిళ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిపై రాసిన కవితను చదివి వినిపించారు. ఇందులోనే తెలంగాణకు చెందిన రాజ్ కుమార్ నాయక్ తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజులపాటు నిర్వహించిన పేరిణి నాట్యం గురించి చెప్పారు. కాకతీయరాజుల కాలంలో ఖ్యాతి పొందిన పేరిణీ నృత్యం ఇప్పటికీ తెలంగాణ మూలాలతో ముడిపడిఉందని కీర్తించారు.