PM Modi : అమిత్ షా కోసం రంగంలోకి ప్రధాని మోడీ

Update: 2024-12-19 11:30 GMT

బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థించారు. అంబేడ్కర్ ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారని, దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడిందని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రతి పక్షంపై ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్న ప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, ఎస్సీ, ఎస్టీలను కించపరచడానికి రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ ప్రతి డర్టీ ట్రిక్స్ ఎలా చేస్తుందో దేశ ప్రజలు పదేపదే చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వ్యాప్తి చేసే అబద్దాలు వారి పరిపాలనలోని ఆకృత్యాలను దాచగలవని భావిస్తున్నారనీ.. అంబేద్కర్ పై కాంగ్రెస్ చేసిన పాపాలు చాలానే ఉన్నాయన్నారు.

అంబేడ్కర్ తో అనుబంధం ఉన్న ఐదు ప్రసిద్ధ ప్రదేశాలైన పంచతీర్థం అభివృద్ధికి కృషిచేశామని, చైత్ర భూమి సమస్యను పరిష్కరించామని, అక్కడ ప్రార్థనకు కూడా వెళ్లానని మోడీ ఎక్స్ లో వరుస ట్వీట్లు చేశారు. "ఎన్నికల్లో అంబేద్కర్ కు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేయడం, భారతరత్న ఇవ్వకపోవడం, ఆయన చిత్రపటానికి చోటు కల్పించకపోవడం వంటివెన్నో ఉన్నాయి. ఏళ్ల తరబడి అధికారంలో కూర్చున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సాధికారత కల్పించేందుకు కాంగ్రెస్ ఏమీ చేయలేదు. మా ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తోంది. చివరి రోజుల్లో గడిపిన ఢిల్లీలోని 26 అలీపూర్ రోడ్ ను అభివృద్ధి చేశాం. లండన్లో ఆయన నివసించిన ఇంటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంబేద్కర్ విషయానికి వస్తే, ఆయన పట్ల మా గౌరవం సంపూర్ణం" అని ప్రధాని వివరించారు.

Tags:    

Similar News