PM Modi: నేడు బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారం

Update: 2025-10-24 01:45 GMT

ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ గ్రామం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలుత కర్పూరి ఠాకూర్‌కు మోడీ నివాళులర్పించనున్నారు. అనంతరం సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీ ప్రారంభించనున్నారు. శుక్రవారం సమస్తిపూర్, బెగుసరాయ్‌ల్లో మోడీ ఎన్నికల ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ వెల్లడించారు

కర్పూరి ఠాకూర్‌కు గత సంవత్సరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయన మరణించిన 35 సంవత్సరాల ఈ పురస్కరం లభిచింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అవార్డు లభించింది. కర్పూరి ఠాకూర్ ఫిబ్రవరి 17, 1988న మరణించారు.

కర్పూరి ఠాకూర్ ఎవరు?

‘జన్నాయక్’ లేదా పీపుల్స్ లీడర్‌గా ఠాకూర్ పేరు సంపాదించారు. నాయి (బార్బర్) వర్గానికి చెందిన ఒక చిన్నకారు రైతు కుమారుడు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిసెంబర్ 1970- జూన్ 1971 మధ్య భారతీయ క్రాంతి దళ్‌లో భాగంగా సీఎంగా పని చేశారు. డిసెంబర్ 1977-ఏప్రిల్ 1979 మధ్య జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పని చేశారు. 1978లో ప్రభుత్వ సేవల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అత్యంత వెనుకబడిన తరగతుల (ఇబీసీలు) (ముస్లింలలోని బలహీన వర్గాలతో సహా) వర్గాన్ని తగ్గించడంలో ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. మెట్రిక్యులేషన్ పరీక్షలకు తప్పనిసరి సబ్జెక్టుగా ఇంగ్లీషును తొలగించడం. మద్యపాన నిషేధానికి కూడా ఠాకూర్ ప్రసిద్ధి చెందారు. ఠాకూర్ ప్రజలచే ప్రేమించబడటమే కాకుండా ప్రతిపక్షాలచే కూడా గౌరవింపబడ్డారు.

ఇదిలా ఉంటే గురువారం బీహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిని ‘లత్‌బంధన్’ కూటమి(నేరస్థుల కూటమి)గా పిలిచారు. ఆ కూటమిలో ఉన్నవారంతా బెయిల్‌పై బయటకు తిరుగుతున్నవారేనని పేర్కొన్నారు. ‘‘జంగిల్ రాజ్’’ను మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని.. ఆ కాలపు అనుభవాలను యువతరానికి అందించాలని కోరారు.. ప్రతిపక్షాలు తమ తప్పును దాచడానికి ఎంత ప్రయత్నించినా.. ప్రజలు దానిని క్షమించరన్నారు. ప్రతిపక్ష నేతలకు తమలో తాము ఎలా పోట్లాడాలో.. స్వప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు అన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ, స్టార్టప్ హబ్‌లను సృష్టించాల్సిన అవసరం ఉందని.. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని… యువత కీలక పాత్ర పోషించాలని మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News