ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పు తీసుకు రావడమే లక్ష్యంగా గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. దీని ద్వారా దేశం అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. వివిధ ఆర్థిక ప్రణాళికలకు బహుళ-మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను అందించడం కోసం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ను 2021, అక్టోబర్ 13న అమల్లోకి తీసుకువచ్చారు. దీనిని ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గతిశక్తి దేశంలోని రైల్వే, రోడ్లు, ఓడరేవులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నా. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునేందుకు గతిశక్తి ఉపయోగపడుతుందన్నారు. మరిన్ని నూతన ఆవిష్కరణలను సైతం ప్రోత్సహిస్తోందని తెలిపారు.