PM Modi: కుక్కలు మాత్రమే వాళ్ళకు జంతువులు..జంతు ప్రేమికులపై ప్రధాని సెటైర్లు..

‘‘గోవులు వారికి జంతువులుగా కనిపించవు’’ అని కామెంట్స్..

Update: 2025-09-14 02:23 GMT

కొన్ని రోజుల క్రితం వీధి కుక్కల విషయంలో చాలా పెద్ద రచ్చే జరిగింది. ఢిల్లీలో కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. తీర్పు సరి చేసేలా చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టస్తున్నాయి. శుక్రవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ..నేను ఇటీవల కొంత మంది జంతు ప్రేమికులను కలిశాను అని చెప్పారు. దీంతో పరేక్షకులు నవ్వడం మొదలుపెట్టారు. దానికి బులుగా ప్రధాని ఎందుకు నవ్వుతున్నారు...నిజంగానే మన దేశంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మందికి కేవలం కుక్కలు మాత్రమే జంతువులు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. గోవును మాత్రం యానిమల్ కింద చూడరనిచురకలు వేశారు. ప్రధాని మోదీ ఈ మాటలకు ప్రేక్షకులతో పాటూ..కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నవ్వుతూ స్పందించారు.

కుక్కలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జంతు ప్రేమికులకు కుక్కలు మాత్రమే యానిమల్స్ ఆవులు కాదు అంటూమోదీవిమర్శించడం..జంతు ప్రేమికుల్లో కలకలం రేపింది. అయితే ప్రధాని ఉద్దేశ్యం మాత్రం వేరని చెబుతున్నారు. కు్కలు, గోవుల పట్ల వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారన్నారు. అన్ని యానిమల్స్ నూ సమానంగా చూడాలని ప్రధాని మోదీఉద్దేశమి చెబుతున్నారు. 'జంతువు' అనే పదం కేవలం వీధి కుక్కలకు లేదా పెంపుడు కుక్కలకు మాత్రమే వర్తించదని.. అన్ని జంతువులకూ అది సమానమని ఆయన పరోక్షంగా సూచించారని అంటున్నారు. అందులోకిబీజేపీ, ఆరఎసఎస్ కు గోవు పవిత్ర జంతువు. ప్రధాన మోదీ అధికారంలోకి వచ్చాక గోసంరక్షణ కోసం అనే కార్యక్రమాలు చేపట్టారు. దీని కోసం 2019లో రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. దీనిపై జంతుప్రేమికులు గొడవ చేయడంతో తీర్పునే ఏకంగా మార్చాల్సి వచ్చింది. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు  కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని షెల్టర్లకు తరలించాలని ఈ నెల 11న తీర్పు ఇచ్చిన సుప్రీం.. ఇప్పుడు ఆ తీర్పును సవరించింది. షెల్టర్ హోమ్‌కు పంపిన కుక్కలను విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. పలువురు ఆ తీర్పుపై నిరసన వ్యక్తం చేయడంతో తన నిర్ణయాన్ని సుప్రీం మార్చింది. రేబిస్‌ ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్ తర్వాత ఆ కుక్కలను విడుదల చేస్తామని వెల్లడించింది. మున్సిపల్ వార్డులలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల నియంత్రణ కోసం పనిచేసే ప్రభుత్వ అధికారులకు ఎవరైనా అడ్డుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. జంతు ప్రేమికులువీధికుక్కలనుదత్తతతీసుకోవాలనుకుంటేమున్సిపల్కార్పొరేషన్ఆఫ్ఢిల్లీ  కిదరఖాస్తుచేసుకోవచ్చనితెలిపింది.

Tags:    

Similar News