Mallikarjun Kharge: ఉగ్రదాడి గురించి మోదీకి ముందే తెలుసు..
ఖర్గే సంచలన ఆరోపణ..;
కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇవ్వడం వల్లే ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెహల్గామ్ దాడి ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వైఫలం జరిగినట్లు ప్రభుత్వం అంగీకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ బాధ్యత తీసుకోలేమా అని ఆయన అడిగారు.
ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినా, పెహల్గామ్‌లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అదనపు భద్రతను పెంచలేదని ఖర్గే ప్రశ్నించారు. కానీ పెహల్గామ్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. పార్టీ కన్నా ముందు దేశం నిలుస్తుందన్నారు. రాజకీయ విభజనల కన్నా.. జాతి ఐక్యత కీలకమని అంగీకరించారు.