PM Modi: సుశీల్ మోడీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని
బీహార్‌లో ప్రధాని మోడీ రోడ్ షో;
బీహార్‌లోని పాట్నాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నివాసానికి ప్రధాని వచ్చారు. ముందుగా సుశీల్ మోడీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
ఇటీవలే దివంగత బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూశారు. కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. పలుమార్లు ఆర్థిక మంత్రిగా సేవలందించారు. నితీష్‌కుమార్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పని చేశారు. రాజకీయాల్లో బహు అనుభవం కలిగిన నేతగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా సుశీల్ మోడీని నియమించారు. కానీ ఆయన అకాల మరణం పొందారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ బీహార్‌లో రోడ్ షో నిర్వహించారు. వాహనంలో నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చరు. ప్రధాని మోడీ వెంట రాష్ట్ర బీజేపీ నేతలు, జేడీయూ నేతలు ఉన్నారు. ఇక్కడ జేడీయూ, బీజేపీ ఉమ్మడిగా బరిలోకి దిగింది.
1973లో విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశీల్ మోదీ.. 1990లో పట్నా సెంట్రల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఎంపీగా సేవలందించారు. 2005 నుంచి 2020 మధ్య రెండు దఫాలుగా 11 ఏళ్ల పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.