PM Modi: ఆపరేషన్ సిందూర్‌లో మెడ్ ఇన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయి..

తమిళనాడులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..;

Update: 2025-07-27 01:15 GMT

తమిళనాడు అభివృద్ధి మా ప్రధాన నిబద్ధత అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తూత్తుకూడి ఏయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌ని ఆయన శనివారం ప్రారంభించారు. గత దశాబ్ధంతో పోలిస్తే, ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కన్నా ఎక్కువ నిధుల్ని తమిళనాడుకు ఇచ్చిందని అన్నారు. ఒకప్పుడు తూత్తుకూడి ప్రసిద్ధ ముత్యాలు భారతదేశ ఆర్థిక శక్తికి చిహ్నంగా ఉండేవని చెప్పారు. ఈ ముత్యాలనే తాను బిల్ గేట్స్‌కి గిఫ్ట్‌గా ఇచ్చానని గుర్తు చేశారు.

రూ. 550 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 2000 మెగావాట్ల కుడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్ట్ ట్రాన్స్‌మిషన్ లైన్ రాబోయే ఏళ్లలో దేశానికి స్వచ్ఛమైన విద్యుత్‌ని అందిస్తుందని అన్నారు. తమిళనాడులో తమ ప్రభుత్వం నిర్మించిన రైల్వే ప్రాజెక్టులు దక్షిణ తమిళనాడు ప్రాంతంలోని అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోందని చెప్పారు. మధురై నుంచి బోడినాయకనూర్ విద్యుదీకరణ వల్ల వందేభారత్ వంటి రైలు నడవడానికి మార్గం ఏర్పడిందని చెప్పారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ బ్రిడ్జ్‌ని పంబన్‌లో నిర్మించామని చెప్పారు.

ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో భారత ఆయుధాలు మేడ్ ఇన్ ఇండియా సత్తానున చాటాయని చెప్పారు. భారత ఆయుధాలు టెర్రరిస్టుల యజమానులకు రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పారు. బ్రిటన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల 99 శాతం భారతీయ ఉత్పత్తులకు పన్ను లేకుండా చేసిందని, ఇది తమిళనాడు యువత, చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరస్తుందని చెప్పారు. మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతీయార్ ‌కు తన నియోజకవర్గం కాశీతో సంబంధాలు ఉన్నాయని, కాశీ-తమిళ సంగం వంటి కార్యక్రమాల ద్వారా మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News