మొఘలులను ఓడించిన అస్సాంలోని అహోం రాజ్యానికి చెందిన రాయల్ ఆర్మీకి చెందిన ప్రముఖ జనరల్ లచిత్ బోర్ఫుకాన్ అద్భుతమైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈరోజు (మార్చి 9) ఆవిష్కరించారు. ప్రాజెక్ట్‌లో లచిత్, తాయ్-అహోమ్ మ్యూజియం, 500 సీటింగ్ కెపాసిటీ గల ఆడిటోరియం నిర్మాణం కూడా ఉన్నాయి.
ఇది లచిత్ బోర్ఫుకాన్ శౌర్యాన్ని జరుపుకోవడానికి, అతని గురించి అవగాహన పెంచడానికి చేసిన ప్రయత్నం. ఇది టూరిజంను కూడా పెంచుతుంది, ఉపాధి అవకాశాల కల్పనకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే జోర్హాట్‌లో ప్రధాని మోదీకి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ బహుమతులు అందజేశారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాకారం చేసుకోవాలని అన్నారు. 'వికసిత్ భారత్' తీర్మానం నెరవేరాలంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి అవసరం...కాంగ్రెస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటి చిత్రాలను క్లిక్ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, పారిపోయింది. కానీ మోదీ ఈశాన్య ప్రాంతమంతా తన కుటుంబంలా భావిస్తారు. .." అని ఆయన చెప్పారు.