బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి మరోసారి జయకేతనం ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాట్టుకు కావాల్సిన మెజార్టీని సాధించి మరోసారి అధికారాన్నిపదిలం చేసుకుంది. బిహార్‌తో పాటు.. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ కషాయ జెండా రెపరెపలాడింది. అనేక రాష్టాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుని కమలం వికసింది. దీంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీల విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. విజయోత్సవ సభకు.. బీజేపీ అగ్రనాయకత్వం, పార్టీ శ్రేణులు కూడా భారీగా తరలివచ్చారు. మోదీని గజమాలతో సత్కరించారు. పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ..అభివాదం చేశారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ అన్నారు.