PM Narendra Modi: ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
ప్రజలంతా సంతోషంగా ఉండాలంటూ విషెస్..;
ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దివ్యమైన దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతంగా జీవించాలని కోరుకుంటున్నానని పోస్టులో పేర్కొన్నారు. ‘‘ దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దివ్యమైన దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ మాత, శ్రీ గణేషుని అనుగ్రహంతో ఆశీర్వదించబడాలి’’ అని ట్వీట్ చేశారు.
ఇదే కాకుండా ఈ రోజు భారతరత్న, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘ భారతభారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళి. దేశం యొక్క ఐక్యత మరియు సార్వభౌమత్వాన్ని రక్షించడం అతని జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.’’ అని ఎక్స్ పోస్టులో చెప్పారు.