M Modi: అప్రూవల్ రేటింగ్స్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో మోడీ..
ప్రధాని మోదీ నయా రికార్డ్ .. 8వ ర్యాంకుకు పరిమితమైన డొనాల్డ్ ట్రంప్..;
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సత్తా చాటారు. వరల్డ్ డెమొక్రటిక్ అప్రూవల్ రేటింగ్స్ లో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచారు. ప్రధానికి అప్రూవల్ రేటింగ్స్ లో 75 శాతం అప్రూవల్ తో టాప్ స్థానంలో ఉన్నారు. భారత్ లో కేవలం 18 శాతం మందికే ప్రధాని మోదీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని తేలింది. ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక ఆయన అప్రూవల్ శాతం మరింత పెరిగిందని అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
మోడీ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతంతో రెండో స్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 45 శాతంత ఆమోదంతో 8వ స్థానంలో నిలిచారు.. ట్రంప్ అప్రూవల్ శాతం 44 గా ఉండటం గమనార్హం. ఇందుకు ఆయన తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలే కారణమని.. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ల కారణంగా ఆయన స్థానం 8 కు పడిపోయినట్లు నివేదిక తేల్చింది. ఇక మార్నింగ్ కన్సల్ట్ సర్వే ఫలితాలు దేశంలో, విదేశాల్లో ప్రజల్లో మోడీ ఆదరణకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. తాజా అప్రూవల్ రేటింగ్స్ జూలై 4-10, 2025 నుంచి సేకరించిన డేటా ఆధారంగా వెల్లడించారు.
ప్రపంచ నాయకుల ర్యాకింగ్స్, ‘అప్రూవల్ రేటింగ్స్’:
1) నరేంద్రమోడీ (భారత్)- 75 శాతం
2) లీ జే మ్యుంగ్ (దక్షిణ కొరియా)- 59 శాతం
3) జేవియర్ మిలేయ్ (అర్జెంటీనా)- 57 శాతం
4) మార్క్ కార్నీ (కెనడా)- 56 శాతం
5) ఆంథోనీ అల్బనీస్ (ఆస్ట్రేలియా)- 54 శాతం
6) క్లాడియా షైన్‌బామ్ (మెక్సికో) – 53 శాతం
7) కారిన్ కెల్లర్-సట్టర్ (స్విట్జర్లాండ్) – 48
8) డొనాల్డ్ ట్రంప్ (యూఎస్ఏ)- 44 శాతం
9) డొనాల్డ్ టస్క్ (పోలాండ్) – 41 శాతం
10) జార్జియా మెలోనీ (ఇటలీ)- 40 శాతం
11) సిరిల్ రామాఫోసా (దక్షిణాఫ్రికా) -37 శాతం
12) బార్ట్ డి వేవర్ (బెల్జియం)-36 శాతం
13) ఫ్రెడ్రిచ్ మెర్జ్ (జర్మనీ)-34 శాతం
14) క్రిస్టోయన్ స్టోకర్ (ఆస్ట్రియా)- 34 శాతం
15) జోనాస్ గుహ్ స్టోర్ (నార్వే)- 33 శాతం
16) 2) తయ్యిప్ ఎర్డోగన్ (టర్కీ)- 33 శాతం
17) ఉల్ఫ్ క్రిస్టర్షన్ (స్వీడన్)-33 శాతం