పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 9న జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ క్యాంపస్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ ర్యాలీ తీశారు. ఇదో మరో నిర్భయ ఘటన అంటూ డాక్టర్లు మండిపడుతున్నారు. ఈ విషయమై ఇండియా కూటమి మిత్ర పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయకుండా స్థానికంగా వున్న మమతా ప్రభుత్వం నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తుందని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరిగినా ఏ చర్యలు తీసుకోలేదని రాహుల్ మాటలకు కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీ.