Prabhas Ravan Dahan : విల్లు ఎక్కుపెట్టి రావణ దహనం చేసిన ప్రభాస్..
Prabhas Ravan Dahan : ఢిల్లీలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. శరన్నవరాత్రి చివరి రోజు ఎర్రకోట దగ్గర రామాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు;
Prabhas Ravan Dahan : ఢిల్లీలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. శరన్నవరాత్రి చివరి రోజు ఎర్రకోట దగ్గర రామాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున తరవచ్చారు. అటు రామ్‌లీల మైదానంలో ఆదిపురుష్ టీమ్ సందడి చేసింది.
రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్, హీరో ప్రభాస్ పాల్గొన్నారు. హీరో ప్రభాస్‌కు స్థానిక నేతలు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం విల్లు ఎక్కుపెట్టి రావణ దహనం చేశారు ప్రభాస్. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
రావణ దహన కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు జై శ్రీరామ్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాంలీలా మైదానంకు ప్రభాస్ వస్తున్న సమచారం ఉండటంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.