Gandhi Jayanti : జాతిపితకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ కూడా;
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ దన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా, ఢిల్లీ సీఎం అతిశీ రాజ్‌ఘాట్ సందర్శించించారు. అంతకుముందు ప్రధాని మోదీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు.
తరువాత స్వతంత్ర భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు విజయ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం భావి తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశ స్వాభిమానం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా గాంధీ మహాత్మునికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా గాంధీజీకి, లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.