Bihar election : ఎన్డీయే తరఫున 12 ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే తరఫున మోదీ మొత్తం 12 ర్యాలీల్లో పాల్గొంటారని బీజేపీ వెల్లడించింది..

Update: 2020-10-22 14:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే తరఫున మోదీ మొత్తం 12 ర్యాలీల్లో పాల్గొంటారని బీజేపీ వెల్లడించింది. మొదటి రోజు ససారాం, గయా, భగల్‌పూర్‌లలో మూడు ర్యాలీల్లో పాల్గొంటారు. ఇక ఈ నెల 28న దర్భాంగ, ముజఫరాపూర్, పాట్నాలో ర్యాలీలు నిర్వహిస్తారు. నవంబర్ 3న ఛాప్ర, తూర్పు చంపారన్, సమస్తపూర్‌లో జరిగే ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు.

ససారాంలో ఎన్డీయే మిత్రపక్షమైన జనతాదళ్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే మోదీ బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. కొవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా మోదీ ప్రచారం నిర్వహిస్తారు. ఇక మోదీ ర్యాలీలను బీజేపీ డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఎల్ఈడీల ద్వారా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో మోదీ ప్రసంగం అందించాలని ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తెలిపారు. బీహార్‌ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడుతాయి.

Tags:    

Similar News