Prime Minister Modi : కువైట్ పర్యటనలో ప్రధాని మోడీ

Update: 2024-12-21 11:45 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన కువైట్‌లో పర్యటిస్తారు. కువైట్‌ రాష్ట్ర అమీర్‌ షేక్‌ మెషాల్‌ అల్‌- అహ్మద్‌ అల్‌-జాబర్‌ అల్‌-సబాహ్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ కువైట్‌ను సందర్శిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్శన భారత్‌, కువైట్ మధ్య బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుందిని పేర్కొన్నారు. కువైట్ యొక్క అగ్ర వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఉంది. కువైట్‌లో భారతీయ కమ్యూనిటీ అతిపెద్ద ప్రవాస సంఘం, అని ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం కువైట్‌లో అమిరీ టెర్మినల్‌కు చేరుకుంటారు ప్రధాని మోడీ. అనంతరం గల్ఫ్‌ స్పిక్‌ లేబర్ క్యాంపును సందర్శిస్తారు. కువైట్‌లోని ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ సంభాషిస్తారు. రేపు భారత్‌కు ప్రధాని మోడీ తిరిగి ప్రయాణం అవుతారు.

Tags:    

Similar News