Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీలో కరోనా కలవరం.. ప్రియాంక గాంధీకి పాజిటివ్..
Priyanka Gandhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు.;
Priyanka Gandhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. అయితే.. ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కూతురు ప్రియాంకా గాంధీకి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తన తల్లికి కరోనా సోకిందని తెలియగానే నిన్న లక్నోలో ఉన్న ప్రియాంక తన టూర్‌ను రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చేశారు. అయితే.. షెడ్యూల్‌ను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో లక్నోలో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుంచి వెనక్కి వచ్చేశారు. ఆమెకు కూడా కరోనా నిర్ధారణ అయింది.