Priyanka Gandhi : బతుకమ్మ ఉత్సవాల్లో ఇందిరా గాంధీ ఫోటోను షేర్ చేసిన ప్రియాంకా గాంధీ..
Priyanka Gandhi : తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా;
Prianka Gandhi : తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా. 1978లో ఓరుగల్లులో శ్రీమతి ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అంటూ ట్వీట్ చేశారు ఆమె. ప్రకృతిని ప్రేమిస్తూ, పువ్వులను పేర్చి, ఊరు వాడా కలిసి చేసుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కల్గించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రియాంక వాద్రా.
తెలంగాణా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 27, 2022
1978లో ఓరుగల్లు మహిళలతో మా నానమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి. pic.twitter.com/pcJQSEE1Cf