Punjab Cabinet: పంజాబ్ క్యాబినెట్ లో కొలువుదీరే మంత్రులు వీరే!
Punjab Cabinet: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ సర్కార్ ఈనెల 16న కొలువుదీరనుంది.;
Punjab Cabinet: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ సర్కార్ ఈనెల 16న కొలువుదీరనుంది. రాజ్‌భవన్‌లో కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ స్వగ్రామమైన ఘట్కర్‌కలన్‌లో ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 16 మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో డిఫ్యూటీ సీఎంగా కుల్తాన్ సింగ్ సంద్వానా, ఆర్థిక మంత్రిగా అమన్ అరోరా, విద్యాశాఖ మంత్రిగా బుధ్‌రామ్‌లకు చోటు దక్కింది. మాన్ వద్దే హోంమంత్రిత్వశాఖ ఉండనుంది.
ఆప్ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం సమావేశమై భగవంత్ మాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మాన్ అనుమతి కోరనున్నారు. ఇక మార్చి 13న అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
అంతకుముందు భగవంత్ మాన్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో ఆయన్నుకలుసుకున్నారు. కేజ్రీవాల్ ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కూడా భగవంత్ మాన్ భేటీ అయ్యారు.
కాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు.