Punjab Election 2022: పంజాబ్‌లో పోటాపోటీగా నేతల ఎన్నికల ప్రచారం..
Punjab Election 2022: పంజాబ్‌లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తున్నాయి పార్టీలు.;
Punjab Election 2022: పంజాబ్‌లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తున్నాయి పార్టీలు. ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ప్రియాంక గాంధీ పంజాబ్‌లో ప్రచారం చేయబోతున్నారు. ఈ ముగ్గురూ ఒకే రోజు ప్రచారం చేస్తుండడంతో పంజాబ్‌లో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అమృత్‌సర్, లుథియానా, పాటియాలాలో అమిత్ షా ర్యాలీలు చేపట్టనున్నారు. కేజ్రీవాల్ సైతం ఇవాళ అమృత్‌సర్‌లోనే ప్రచారం చేస్తున్నారు.
ప్రియాంక గాంధీ కోట్కాపురాలో పబ్లిక్ మీటింగ్, ధురిలో మహిళలలో సమావేశం, డేలా బస్సీలో రోడ్ షో నిర్వహించనున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఏకపక్ష విజయం తథ్యమని చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతోందని, హంగ్ ఏర్పడే అవకాశమే లేదని చెప్పారు. మరి కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా చన్నీనే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు సిద్ధూ.
కాంగ్రెస్ అంటేనే కార్యకర్తలు, నేతల సమూహం అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని వివరించారు. అటు ప్రచార నిబంధనలు సడలించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకపై పాదయాత్రలు చేసుకోవచ్చు, రాత్రి పది గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు, ఉదయం ఆరు గంటల నుంచే ప్రచారం మొదలు పెట్టవచ్చని ఈసీ తెలిపింది. దీంతో నిబంధనలకు అనుగుణంగా ప్రచార సరళి మార్చుకుంటున్నాయి పార్టీలు.